

పువ్వుల నాగేశ్వరరావు పెద్దకర్మ రోజున అతిరథ మహారథులు హాజరై ఘన నివాళులు అర్పించారు. సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ పవన్ ఈశ్వరమ్మ భర్త సీనియర్ రాజకీయ నేత నాగేశ్వరరావు (67) కు పూల మాలలు వేసి నివాళులర్పించారు ఆయన గొప్పతనాన్ని పలువురు గుర్తుచేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం పిడికి రాజన్న దొర, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు శత్రుచర్ల విజయరామరాజు, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి విజయనగరం, రాజాం పరిశీలకులు కే.వి. సూర్యనారాయణ, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి కురుపాం పార్వతీపురం నియోజకవర్గం మక్కువ జడ్పిటిసి మామిడి శ్రీనివాస నాయుడు నియోజకవర్గం ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు స్నేహితులు బంధువులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
