
దీక్ష మహిళా వెల్ఫేర్ సొసైటీ & మండలి వారి ఆద్వర్యం లో ముంగివాని వలస గ్రామంలో బాలింతలకు,మహిళలకు పౌష్టికాహార కిట్లు విశాఖ నగరంకి
చెందిన లీ ఫార్మసీ కంపెనీ సభ్యుల చేతుల మీదుగా అందించారు. గర్భిణీలకు బాలింతలకు ఐరన్, క్యాల్షియంతో కోరిన ఆహారం తీసుకోవడం అత్యవసరమని దీనివలన వారి రక్తహీనత తగ్గి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు మెరుగవుతాయని అందుకే న్యూట్రిషన్ కిట్లను అందజేస్తున్నట్టు తెలిపారు. దీక్ష వెల్ఫేర్ సొసైటీ సంస్థ సీఈవో శాంతి మాట్లాడుతూ సాలూరు పరిసర ప్రాంతాల్లో మహిళను ఎక్కువగా రక్తహీనత బాధపడుతున్నారని అన్నారు వారిని ఉద్దేశిస్తూ రాగులు, కొర్రలు ,సాములతో తయారైన వంటకాలను తీసుకోవడం వల్ల రక్తహీనతను అరికట్టవచ్చని… ఇవి మన ప్రాంతంలో సమృద్ధిగా దొరుకుతాయని అన్నారు. సిడిపిఓ మంగమ్మ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలలో ఎక్కువగా రక్షహీనత కనిపిస్తుందని, పోస్ట్కారంతో రక్తహీనతను అరికట్టవచ్చని ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని, అంగన్వాడి వర్కర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని వాటిని పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం కి చెందిన లీ ఫార్మసీ కంపెనీ డైరెక్టర్ ఏ లీల రాణి, దీక్ష మహిళా వెల్ఫేర్ సొసైటీ బాడంగి సీఈవో శాంతి, ఐ సి డి ఎస్, సి డి పి ఓ మంగమ్మ సూపర్ వైజర్లు జి.అనురాధ,ఎస్. లక్ష్మి , అర్.ధనలక్ష్మి, ధరణి ఎఫ్ బి ఓ సీఈవో ఎం. భీమారావు,బి. వెంకటరమణ,కోన రాము పాల్గొన్నారు.
