
తాడింగివలస వలస గ్రామంలో శుక్రవారం బొమ్మనేని శ్రీను అనే రైతు డ్రంసీడర్ పద్ధతుల్లో వ్యవసాయం కొనసాగిస్తూ డ్రోన్ ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం ద్వారా తయారుచేసిన దశపర్ని మీనామృతం కలిపి వరి చేనుకు ఐదు ఎకరాలు స్ప్రేయింగ్ చేయించడం జరిగింది. ఈ స్ప్రేయింగ్ వల్ల ఉపయోగాలు దశపర్ని కషాయం వలన పురుగులు, తెగులు కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రోత్ ప్రమోటర్ గా ఉపయోగపడుతుంది. ఇందులో మీనామృతం కూడా కలపడం వలన దిగుబడికి గింజ నాణ్యత బరువు మెరుపు దిగుబడికి కూడా ఉపయోగపడుతుందని వ్యవసాయ అధికారి కే .శిరీష తెలిపారు.ఈ విధంగా రైతులందరూ ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసిన కషాయాన్ని ఆరోగ్యం కొరకు స్ప్రేయింగ్ చేస్తూ తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని పొందుతూ, ఎక్కువ దిగుబడిని పొందగలరని కోరారు. ఈ కార్యక్రమానికి వి ఏ ఏ లు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పొలాలకు స్ప్రేయింగ్ చేయుటకు డ్రోన్ పద్ధతిని అందరూ ఉపయోగించవలెను అని కోరటం జరుగుతుంది.