

ప్రస్తుతం వరి పంటలో దోమపోటు ఆశించిందని ….పిల్ల పురుగుల దశలోనే దోమపోటును సమర్థవంతంగా నివారించుకోవాలని లేనియెడల పంట నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. డ్రోన్ సహాయంతో దోమపోటు, అగ్గి తెగులు వంటి తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చని వీటి వ్యాప్తి చాలా జోరుగా ఉంటుందని, వ్యాపించిన తొలి దశలోనే నివారణ చర్యలు చేపట్టాలని, మామూలు చేతి పంపులతో మందుల పిచికారి చేయడం ద్వారా ఎక్కువ సమయం తీసుకోవడం వలన ఈ తెగుళ్ళ ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి డ్రోన్ల సహాయంతో తెగులు ఆశించిన వెంటనే పిచికారి చేయడం ద్వారా సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. చెరుకుపల్లి పీ.కోనవలస గ్రామాల రైతులు ఎస్ జయమ్మ , బి కుమార్ , జి వాసు సుమారు 50 ఎకరాల వరి పంటపై డ్రోన్ల సహాయంతో దోమపోటును నివారించే డైనోటో ఫ్యూరాన్, అగ్గి తెగులు పాము కూడా తెగుళ్లను నివారించే అమిస్టార్ టాప్ మందులను డ్రోన్ ద్వారా పిచికారి చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రోన్ వినియోగించడం ద్వారా వంట కుదుళ్లపై మందు పడుతుందని ఒక ఎకరం ఐదు నుండి పది నిమిషాలలో పిచికారీ పూర్తవుతుందని పిచికారి ఖర్చు తగ్గడమే కాకుండా సమయం ఆదా అవుతుందని కాబట్టి రైతులు డ్రోన్లను సమర్ధంగా వినియోగించుకోవాలని కోరారు అనంతరం పి కొనవలస లో ఉన్న వరి, పత్తి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నాగమణి వీ ఎ ఏ లావణ్య పాల్గొన్నారు.
