
11.10.2025 వ తేదీన యాక్సిడెంట్లో తీవ్ర గాయాలపాలై, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సింగారపు సాగర్ కుటుంబానికి భరోసాగా మేమున్నాం అంటూ…
శ్రీ స్వామి వివేకానంద యువజన సేవా సంఘం, గుమడాం, తరఫున చిరు సహాయం గా 22,300/- రూ.. అందజేయడం జరిగింది.
సంఘ సభ్యులు గ్రామంలో యువత అందరూ కలిసి ఒకే మాటతో ఈ యొక్క విరాళాలను 2 రోజుల వ్యవధి లోనే సేకరించడం జరిగింది.
మొట్ట మొదటి సేవా కార్యక్రమంలో భాగంగా Oct 02 వ తేదీన ఎటువంటి ఆధారం లేకుండా ఉన్న నిరుపేద వృద్ధ మహిళకు (బార గంగమ్మ) వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతినెల 1000/- రూపాయలు సహాయం అందించేందుకు గ్రూప్ సభ్యులు నిర్ణయించుకొని ఈరోజు సహాయం చేయడం కూడా జరిగింది.
సంఘ సభ్యులు
బంటు సోమేశ్వరరావు (BSF జవాన్)(ప్రెసిడెంట్),
దొంతల గౌరీ శంకర్రావు(వైస్ ప్రెసిడెంట్),
దొంతల రమేష్ (సెక్రటరీ),
మూడడ్ల చిన్నారావు (కో. సెక్రటరీ),
వాకాడ వంశీ కృష్ణ (ట్రెజరర్),
గౌరవ సలహాదారులు
చిగురుకోటి నాగరాజు
దొంతల వెంకట్రావు
మూడడ్ల సతీష్
మరడ జగదీశ్వరరావు
బొత్స రామోజీ సంఘ సభ్యులు.
బంటు సోమేశ్వరరావు ( బీఎస్ఎఫ్) (వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్) దేశ రక్షణ సేవలో ఉంటూ గ్రామంలో ఉండే యువతను ఉత్తేజ పరుస్తూ, ప్రతి కార్యక్రమంలో ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు.
యువత అందరూ కలిసి సమాజ సేవలో ఉంటూ, ప్రేమే మార్గం -సేవే లక్ష్యం అనే స్లోగన్ తో నడుచుకునే విధంగా శ్రీ స్వామి వివేకానంద యువజన సేవా సంఘం స్థాపించడం జరిగింది.
