
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో రైతులు 200 లీటర్లు ద్రవజీవామృతం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సి హెచ్ రంగారావు సమక్షంలో తయారీ చెయ్యటం జరిగింది ఈ జీవామృతం తయారీకి కావలసిన పదార్ధాలు దేశి ఆవు మూత్రం , పేడ, పప్పు దినుసుల పిండి , బెల్లం , గుప్పెడు పుట్ట మట్టి, నీరు ఈ ద్రవ జీవామృతం మొక్కలు పైన స్ప్రేయింగ్ చెయ్యటం మొక్కలు లో గ్రోతింగ్ పెరుగుతుంది అని ద్రవ జీవామృతం నేలలో వెయ్యటం వలన నిద్రావస్థలో ఉన్న సూక్ష్మ జీవులు మేల్కొని సూక్ష్మ జీవులు రెట్టింపు అయ్యి మొక్కలకు కావలసిన సూక్ష్మ స్తూల పోషకాలు అందిస్తాయని అని భూమి లో పంటకు మేలు చేసే పోషకాలను అందించే సూక్ష్మ జీవులు వృద్ది చెంది మొక్కకు కావలసిన పోషకాలను వేర్లు ద్వారా అందిస్తాయని అప్పుడు మొక్కలు పెరిగి పంటలు బాగా పండుతాయని మొక్కలు వాతావరణంలో వచ్చే ఒడిదుడుకులు,అధిక ఉష్ణోగ్రత ప్రభావానికి తట్టుకుంటాయని , భూమికి నీటిని పట్టుకునే సామర్ధ్యం ఉంటుంది అని ఎటువంటి రసాయన ఎరువులు అవసరం లేదని అందరు ప్రకృతి వ్యవసాయం చేసి ఎటువంటి కెమికల్ లేని ఆహార పదార్ధాలు తినటం వలన ఆరోగ్యం బాగుంటుందని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సి హెచ్ రంగారావు రైతులు ఏ పోలయ్య, ఎం సూరిబాబు, సి. హెచ్ పెంటయ్య పాల్గొన్నారు.