అక్టోబర్ 11వ తేదీన జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న సింగారపు సాగర్ కుటుంబానికి మేమున్నామంటూ భరోసా అందించారు శ్రీ స్వామి వివేకానంద యువజన సేవా సంఘం ప్రతినిధులు సంఘ సభ్యులు గ్రామ యువత అందరూ కలిసి రెండు రోజులలో విరాళాలు సేకరించి అందించారు. మొట్టమొదటగా ఎటువంటి ఆధారం లేని వృద్ధ మహిళ బార
గంగమ్మ వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతినెల 1000 రూపాయలు అందించే బృహత్తర కార్యక్రమం కు శ్రీకారం చుట్టారు. సేకరించిన 22 వేల 300 రూపాయలు విరాళం ప్రెసిడెంట్ బంటు సోమేశ్వరరావు (బిఎస్ఎఫ్ జవాన్), వైస్ ప్రెసిడెంట్ దొంతల గౌరీ శంకరరావు, సెక్రటరీ దొంతల రమేష్, కో సెక్రటరీ మూడడ్ల చిన్నారావు, ట్రెజరర్ వాకాడ వంశీ, సలహాదారులు చిగురుకోట నాగరాజు,మూడడ్ల సతీష్, మారడా జగదీశ్వరరావు, బొత్స రామోజీ ఇంకా సంఘ సభ్యులు పాల్గొన్నారు.