

ఉత్తరాంధ్ర భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం 18వ శతాబ్దం లో నిర్మించారు. పురాణ కథ ప్రకారం గజపతి వంశానికి చెందిన పూసపాటి పెద విజయ రామరాజు సోదరి పైడిమాంబ దేవత అని తెలుస్తోంది.బుదవారం తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలలో భాగంగా జరిగే తెప్పోత్సవం కు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు. విజయనగరం పట్టణంలో పెద్ద చెరువులో అమ్మవారు హంస వాహనంపై ముమ్మారు విహరించి దర్శనం ఇచ్చారు. వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి కటాక్షాన్ని పొందారు.
