

స్థానిక గవర్నమెంట్ ఐటిఐ సాలూరు టౌన్ లో అక్టోబర్ 13 సోమవారం జరిగిన జాబ్ మేళా కు 198 మంది హాజరు కాగా
113 మంది ఎంపిక అయ్యారు.
ఆదాని ఎనర్జీ సొల్యూషన్స్ కి 38 మంది, పాటిల్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కి 28 మంది, డి మార్ట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ కి 16 మంది, హీరో కి 20 మంది ఎంపికయ్యారు…. వీళ్ళకి ఉచిత భోజనం ఉచిత వసతి కల్పిస్తామన్నారు…
వివిధ కంపెనీలు గవర్నమెంట్ ఐటిఐ సాలూరు కు రావడం ఎంతమంది విద్యార్థులను ఎంపిక చేయడం పట్ల విద్యార్థులు,తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
మరి ఈ కార్యక్రమంలో అన్ని కంపెనీల హెచ్ఆర్,లు ఎంప్లాయిమెంట్ ఆఫీస్ స్టాఫ్ స్కిల్ డెవలప్మెంట్ స్టాఫ్ హాజరయ్యారు….. సెలెక్ట్ అయిన అభ్యర్థులు కు ప్లేస్మెంట్ లెటర్లు ఇచ్చి వెంటనే జాయిన్ చేసుకోవాల్సిందిగా ఐటిఐ ప్రిన్సిపాల్ శ్రీనివాసచారి కంపెనీ వారిని కోరారు…. అలాగే ఈ డ్రైవ్ జరగడానికి అన్ని కంపెనీలతో మాట్లాడి సాలూరు కు వచ్చేలా ఏర్పాట్లు సమకూర్చిన ప్లేస్మెంట్ ఆఫీసర్ కోట్ల శ్రీనివాసరావ్ అభినందించారు.
