కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు మేరకు
మున్సిపల్ కమిషనర్ టి.టీ.రత్న కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇటీవల పలు ప్రింట్,ఎలెక్ట్రానిక్ మీడియాలలో కథనాలు వచ్చాయి...
" క్లీనర్ ఎయిర్" వాయు కాలుష్యం నియంత్రణలో భాగంగా వాయు కాలుష్యం తగ్గించడం పై ప్రభుత్వాలు వివిధ ఆదేశాలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి.
కావున సాలూరు పురపాలక సంఘ పరిధిలో తిను బండారాలను తయారు చేస్తున్న స్వీట్స్ బేకరీలు ,హోటల్సు ఖార్కానాలలో తినుబండారాలు తయారు చేయడానికి ఉపయోగించబడిన రంపం పొట్టు, ఊక వీటి నుండి వెలువడిన పొగ ద్వారా వాయు కాలుష్యమై ప్రజలు ఆరోగ్య నష్టం కలుగుతున్నందున వాటి వల్ల టీబి, శ్వాస కోస వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ఈ వాయు కాలుష్యం అరికట్టడానికి పురపాలక సంఘ పరిధిలో ఉన్న రంపం పొట్టు, ఊక , కర్రలు పొయ్యిల ను ఉపయోగిస్తున్నా 15 షాపులను గుర్తించి శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ వాయు కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు దృష్టిలో పెట్టుకొని పర్యావరణ కార్యదర్శులు (సెక్రెటరీ) తో స్వయంగా వారికి నోటీసులు జారీ చేయడమైనది నోటీసులు ఇచ్చిన 24 గం" లోపల పురపాలక సంఘానికి తమ యొక్క సమాధానం రాసి ఇవ్వాలని అలాగే నోటీసు అందిన వారం రోజుల్లోపు ఈ వాయు కాలుష్యానికి వెలువడిన రంపం పొట్టు, ఊక, కర్రలు పొయ్యిలను తొలగించి గ్యాస్ పొయ్యల ద్వారా తమ వ్యాపారాలు కొనసాగించాలని నోటీసులు జారీ చేయడం అయినది ఏ ఒక్కరైనా ఆదేశాలను బేఖాతలు చేసిన తమ వ్యాపారాల లైసెన్సులో రద్దుచేసి తమ షాపులను చట్టరిత్య తగు చర్యలు తీసుకోవలసి వస్తుందని ఆదేశించడమైనది.మంచి చర్య ప్రజలను రక్షించారు.