
సాలూరు పట్టణానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, సాలూరు పట్టణ కోపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు, సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ ఓవర్ ఈశ్వరమ్మ భర్త పువ్వుల నాగేశ్వరరావు(67) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పిడిక రాజన్న దొర, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు శనివారం ఉదయం లక్ష్మీ థియేటర్ కాంప్లెక్స్ వద్ద పార్థివ దేహానికి నివాళులర్పించారు. సాలూరు వైసిపి పార్టీకి ఆయన మరణం తీరని లోటని ప్రజలు నేతలు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గం వివిధ మండలాలకు చెందిన రాజకీయ నాయకులు పట్టణ కౌన్సిలర్లు బంధువులు స్నేహితులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.