
ఈ మేళా ప్రముఖ కంపెనీలు అదాని ఎనర్జీ సొల్యూషన్స్, భగవతి ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్,
పాటిల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్, హీరో మోటార్ సైకిల్స్, డి మార్ట్ ఫ్లిప్కార్ట్ ,అమెజాన్, స్విజ్ మొదలగు కంపెనీలు యొక్క హెచ్ ఆర్ లు వచ్చి 13వ తేదీన వచ్చిన నిరుద్యోగులను ఎంపిక చేసుకుంటారు...
పై కంపెనీ వారు టెన్త్ క్లాస్ ఐటిఐ ఇంటర్మీడియట్ డిప్లమో డిగ్రీ వారిని ఎంపిక చేసుకొని అర్హత ప్రకారం ఉద్యోగాన్ని కేటాయిస్తారు...
ఇంకను ఐటిఐ పాస్ అయిన వారికి అప్రెంటిస్ శిక్షణ కొరకు వారి వారి కంపెనీలకు సెలెక్ట్ చేసుకుంటారు
ఉద్యోగం లభించిన వారికి 15000 రూపాయల నుండి 22,000 వరకు జీతం చెల్లిస్తారు
అప్రెంటిస్ కొరకు తీసుకున్న వారికి 12 వేల రూపాయల నుండి 15,500 వరకు ఇస్తారు
కొద్ది కంపెనీలలో ఉచిత వసతి ఉచిత భోజన సౌకర్యం కలదు
మరికొన్ని కంపెనీలలో డ్యూటీ టైం లో మాత్రమే భోజనం కల్పిస్తారు
ఈ కార్యక్రమం గూర్చి వివరాలు ఐటిఐ ప్రిన్సిపాల్ శ్రీనివాసచారి , ప్లేస్మెంట్ ఆఫీసర్ కే శ్రీనివాసరావు తెలియపరిచారు.
ఈ జాబు మేళాకు హాజరగు విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో మరియు బయోడేటా , క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు ఫోటోలు తో 13వ తేదీన ఉదయం 10 గంటలకు సాలూరులో హాజరు కావాలి
అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ కాని వారు తొమ్మిది గంటల 30 నిమిషములకు వచ్చిన యెడల మా సిబ్బంది స్వయంగా రిజిస్ట్రేషన్ చేస్తారు.... కావున విద్యార్థులు నిరుద్యోగులు అందరూ ఈ మేళాకు హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా ప్రిన్సిపాల్ శ్రీనివాసచారి పిలుపునిచ్చారు....