
“కర్ణుడి చావుకి సవాలక్షా కారణాలు” అన్నట్టు గా సాలూరు టౌన్ లో పరిస్థితులు కాన వస్తున్నాయి. విజయవాడ తరువాత మోటార్ పరిశ్రమ అధికంగా కలిగి ఉన్న పట్టణం మన సాలూరు…
సాధారణంగా సిగరెట్, బీడీలు, చుట్టలు తాగే వారిలో అధికంగా లంగ్ క్యాన్సర్ కనిపిస్తుందని తెలిసిందే. కానీ సాలూరు టౌన్ లో నివసించే ప్రజలు కేవలం పొగతాగడం వల్ల కాకుండా పెరిగిపోతున్న వాయు కాలుష్యం కారణంగా కూడా లంగ్స్ క్యాన్సర్‌కు గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. వైద్య నిపుణుల ప్రకారం.గతంతో పోలిస్తే పొగతాగని వారిలో కూడా లంగ్ క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరిగాయి. దీనికి ప్రధాన కారణం పట్టణంలో ఉన్న ప్రమాదకరమైన వాయు కాలుష్యమే.పట్టణంలో పుట్టగొడుగుల్లా కార్కానాలు పెరిగిపోతున్నాయి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాయు కాలుష్యాన్ని తగ్గించటం కోసం గ్యాస్ వినియోగాన్ని పెంచడం కొరకు అనేక పథకాలతో చిన్న మధ్య తరగతి ప్రజలకు అవగాహనా కల్పిస్తూ వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.కానీ సాలూరు పట్టణం మధ్యలో ఎటువంటి అనుమతులు లేకుండా కార్కానాలను ఏర్పాటు చేసి తీవ్రమైన పొగతో పట్టణంలోని ప్రజల అనారోగ్యానికి కారకులవుతున్న వారిపై అధికారులు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం.పట్టణంలోని చిన్నబజార్ నిత్యం ప్రజలతో కిటకిటలాడుతూ ఉంటుంది.నిత్యం రద్దీగా జనాలతో కిక్కిరిసి ఉండే ప్రదేశంలో పెద్ద పెద్ద పొగ పొయ్యిలను ఏర్పాటు చేసి నిత్యం విపరీతమైన పొగను వదిలి వాయు కాలుష్యానికి కారణం అవుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి అని పట్టణ ప్రజలు కోరుతున్నారు. బంగారమ్మ కాలనీలో ఉన్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారి కార్కానా వలన వాయు కాలుష్యం అవుతుంది అని అధికారులు చర్యలు తీసుకున్నపుడు.పట్టణం నడిబొడ్డులో ఉన్న కార్కానాలపై ఎందుకు చర్యలు తీసుకోవటంలేదు అనే దానిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఇప్పటికే సాలూరు పట్టణంలోని రహదారులు పై దుమ్ము దూళితో అనేక మంది శ్వాసకోస వ్యాధులతో బాధపడుతుంటే పుండు మీద కారం చల్లినట్టు ఇపుడు పట్టణంలో పెరిగిపోతున్న కార్కానాల వలన తీవ్ర వాయుకాలుష్యం ఏర్పడుతుంది.ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని జనావాసాల మధ్య నుంచి పట్టణ శివారు ప్రదేశాలకు లేదా పూర్తిగా వాయు కాలుష్యానికి కారణం అవుతున్నటువంటి పొగ పొయ్యిల వినియోగానికి అడ్డుకట్ట వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.ఇప్పటికైనా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది….
Salur,4thestate.in