
రైతులు కేవలం యూరియా మీద మాత్రమే ఆధారపడకుండా పంటకు కావలసిన నత్రజని భాస్వరం, పొటాష్ ఎరువులను సమతూకంలో వాడాలి… లేని యెడల పోషక లోపాలు ఏర్పడి దిగుబడి తగ్గుతుంది! అని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. మోసూరు గ్రామంలో వి ఏ ఏ ఎల్ దుర్గా ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులు పొటాష్ ఎరువులు రెండు దఫాలుగా వేసుకోవాలని మొదటిసారి దమ్ము లో 15 కిలోలు రెండవసారి చిరు పొట్ట సమీపిస్తున్న దశలో 15 కిలోలు వేసుకోవడం వలన చీడపీడలు తట్టుకునే శక్తి పంటకు వస్తుందని అలాగే గింజల బరువు నాణ్యత బాగా పెరుగుతాయి అని తెలిపారు . యూరియాను మూడు దశలలో వరి పంటకు 25 కిలోల చొప్పున మొక్కదశ పిలక దశ చిరు పొట్ట దశలో వేసుకోవాలని భాస్వరం మరియు కాంప్లెక్స్ ఎరువులను కేవలం దుక్కిలో లేదా దమ్ములో మాత్రమే వేసుకోవాలని తెలిపారు రైతులందరూ ఈ పంట నమోదు చేసుకోవాలని పంట నష్టాలకు వ్యవసాయ రుణాలకు పంటల బీమా పథకాలకు మద్దతు ధరతో పంటల కొనుగోలుకు ఈ పంట అవసరమని తెలిపారు. అనంతరం క్షేత్ర సందర్శన చేసి వరి పంటకు ఆకుమూడత పురుగు సుడిదోమ ఉన్నట్లుగా గుర్తించారు. వీటి నివారణకు ఎసిఫేట్ లేదా కార్తాఫ్ హైడ్రోక్లోరైడ్ లేదా చెస్ వంటి మందులను పిచికారి చేసుకోవాలని తెలిపారు. ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం తూటి కాడ కషాయం ద్వారా దోమపోటును సమర్ధవంతంగా నివారించవచ్చని తెలిపారు అనంతరం సిఆర్పి తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో జిల్లేడు ద్రావణం తయారు చేయించారు ఈ జిల్లేడు ద్రావణం లో అనేక పోషకాలు ఉంటాయని రసాయన ఎరువులైన పొటాష్ వంటివి బస్తా 18 పైగా ఉంటుందని ఎలాంటి ఖర్చు లేకుండా జిల్లేడు గ్రామం ద్వారా పంటకు మంచి పొటాషియం అందించవచ్చని తెలిపారు.
పాచిపెంట,4thestate.in