ఇటీవల కాలంలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కురిశాయి. ముందు జాగ్రత్త చర్యల వలన ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పాఠశాలలో అంగన్వాడీలకు సెలవు ప్రకటించామని, రెడ్ అలెర్ట్ జారీ చేసినందున జాలర్లు వేటకు వెళ్ళరాదని, గిరిజన ప్రాంతాలలో వాగులు వంకలు పొంగడం వలన ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. వర్ష ప్రభావంతో వ్యవసాయ ఉద్యానవన పంటల నష్టం జరిగిన రైతుల ఆందోళన చెందవద్దని కూటమి ప్రభుత్వం అండగా ఉందని అన్నారు నష్టాలు అంచనా వేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు.
4th Estate News @4thestate.in