"ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే... ఇన్ని నాళ్ళు దాగిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదు ఏమి" అనే పాత గీతం గుర్తుకు వస్తోంది...సాలూరు ప్రజల కోరిక తీరనుంది...
సాలూరు టౌన్ దండిగామ్ రోడ్డు లో సుమారు 39 లక్షల వ్యయం తో రైతు బజార్ నిర్మించారు.కానీ విధి వైపరీత్యం వలన ఉపయోగంలోకి రాలేదు.పట్టణ ప్రధాన రహదారి లో కూరగాయల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.ఏఎంసి చైర్మన్ ముఖి సూర్యనారాయణ సాలూరు ప్రజలకు దసరా రోజున శుభవార్త తెలిపారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశాల మేరకు రైతు బజార్ లో విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం విఎంసి చైర్మన్ ముఖి సూర్యనారాయణ తో కలిసి సాలూరు మున్సిపల్ కమిషనర్ టి. రత్నకుమార్, సాలూరు టౌన్ సిఐ బొమ్మిడి అప్పలనాయుడు, శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ సాలూరు రైతు బజార్ లో కలుపు మొక్కలు తొలగించారు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి క్రయ విక్రయాలు జరిగేలా చర్యలు చేపడుతున్నారు.