పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వరిలో వచ్చే కాండం తొలిచే పురుగు నివారణ కొరకు అగ్నస్త్రం కషాయం తయారీ చేసి అగ్నస్త్రం కషాయం పిచికారీ చేయటం వలన వరిలో ఆకు ముడత పురుగు, కాండం తోలుచు పురుగు మొక్కజొన్న లో కత్తెర పురుగు నివారణ కొరకు ఉపయోగపడుతుంద ని రైతులకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పించటం జరిగింది. ప్రకృతి వ్యవసాయం చేయటం వలన నేల సారవంతం పెరుగుతుంది అని ప్రకృతి వ్యవసాయ పంటలు వలన ప్రజలు ఆరోగ్యాలు బాగుంటాయని రైతులుకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సి హెచ్. రంగారావు, టి.సూరిబాబు, పి. కుమారి, బి. లక్ష్మణ్ రైతులు పాల్గొన్నారు.