
సాలూరు టౌన్ కి చెందిన కి చెందిన లేటు నైన అప్పారావు రెడ్డి కుమారుడు, గ్రీన్ వరల్డ్ సంస్థ సాలూరు సభ్యులు నైన శ్రీనివాసరెడ్డి సోదరుడు విశాఖ పట్టణం మధురవాడ ప్రాంతానికి చెందిన నైన రమేష్ రెడ్డి కుమార్తె నైన జైష్యా శ్రీరెడ్డి కూచిపూడి నృత్య ప్రదర్శన లో పాల్గొని గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సాధించిన సంగతి తెలిసిందే.పలు చోట్ల ప్రదర్శనలు ఇస్తూ అందరి ప్రశంసలు పొందుతూ ముందుకు సాగుతున్న చిన్నారి శ్రీ పంచముఖేశ్వర స్వామి ఆలయం లో ఇచ్చిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.ఈ సందర్భంగా పెద్దలు ఆశీర్వాదాలు, ఆశీస్సులు అందుకుంది.