
సాలూరు టౌన్ లో పీఎం శ్రీ మున్సిపల్ హై స్కూల్ లో 10 వ తరగతి విద్యార్థులకు దసరా సెలవులలో వృత్తి విద్య కోర్సులలో ఉచిత శిక్షణ కల్పించారు. వృత్తి విద్య కోర్సులతో వేగంగా స్థిరమైన ఉపాధి కలుగుతుందని, శిక్షకులు తెలిపారు. సాలూరులో హోండా షోరూం వాటర్ ప్లాంట్స్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఇన్చార్జి హెచ్.ఎం శ్యామ్,జిల్లా కో ఆర్డినేటర్ వాసు, ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ ఒకేషనల్ ట్రైనర్స్ గౌరీ శంకర్, రాకేష్ ఆధ్వర్యంలో 10 రోజుల ఇంటర్న్షిప్ కార్యక్రమం జరిగింది.