
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా సెప్టెంబర్ 26 న అవార్డు అందుకున్న సాలూరు వాసి…ఇది సాలూరు ప్రజలకు గర్వకారణం… సాలూరు మండలం, కొమ్మవాని వలస గ్రామ వాసి సంగంరెడ్డి.శ్యామ్ కుమార్ (సీనియర్ జియాలజిస్ట్) ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ సెంట్రల్ హాల్ జరిగిన “జాతీయ భూగోళ శాస్త్ర లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు – 2024” కార్యక్రమంలో భాగంగా “ఖనిజ ఆవిష్కరణ, అన్వేషణ” లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న పార్వతీపురం మన్యం జిల్లా,సాలూరు మండలం,కరాసు వలస పంచాయతీ, కొమ్మవాని వలస గ్రామానికి చెందిన పీవీటీజి గదబ కులస్తుడైన సంగంరెడ్డి.శ్యామ్ ( సీనియర్ జియాలజిస్ట్).ప్రస్తుతం ఈయన విశాఖపట్నంలో సీనియర్ జియాలజిస్ట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, గిరిజనులు సీనియర్ జియాలజిస్ట్ శ్యామ్ కుమార్ కు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.