పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట మండలం, గురువు నాయుడుపేట గ్రామంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో సేవాలాల్ ఫౌండేషన్,మిమ్స్ విజయనగరం వారి సహకారంతో మధుమేహం,రక్త పోటు తదితర వ్యాధులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రజలు హాజరై వివిధ పరీక్షలు చేయించుకొని మందులు ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన పురస్కరించుకొని సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమం లో వైద్యులు బిజెపి నేత హేమా నాయక్, శ్రీ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కోలగట్ల గోపి,బిజెపి నేతలు బిజెపి జిల్లా జనరల్ సెక్రటరీ భానోజీ రావు,ఏపీ బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ రావెళ్ల లక్ష్మణ రావు, సీనియర్ నాయకులు రెడ్డి సింహాచలం,బిజెపి టౌన్ అధ్యక్షులు వానపల్లి మురళి కృష్ణ, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పేర్ల విశ్వేశ్వరరావు, బిజెపి మండల అధ్యక్షులు బి.జనార్ధన్ పాల్గొన్నారు.