జిల్లేడు ద్రావణం పోషకాలమయం

ఆంధ్రప్రదేశ్

జిల్లేడు ద్రావణంలో అనేక పోషకాలు ఉంటాయని అన్ని పంటలపై పిచికారి ద్వారా ఆరోగ్యవంతమైన పంటను పండించవచ్చని వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతి రావు అన్నారు పిండ్రంగివలస గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ జిల్లేడు మొక్కలో తెల్లని లేటెక్స్ తో పాటుగా కార్డియాక్ గ్లైకోసైట్స్ మరియు ఫ్లేవనాయిడ్స్, ఫినాల్స్ ఉంటాయని ఇవి పంటకు పోషకాలను అందించడంతో పాటుగా పురుగులు, తెగుళ్లను కూడా సమర్థవంతంగా నివారిస్తుందని జిల్లేడు ద్రావణం తయారీ అతి సులువైనదని, ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో 20 కిలోల జిల్లేడు ఆకు 10 కిలోల ఆవు పేడ 10 లీటర్ల ఆవు మూత్రం వేసి 48 గంటల పాటు మురగపెట్టి వడగట్టి పిచికారి చేసుకోవాలని తెలిపారు ప్రస్తుతం పడుతున్న వర్షాలకు తెగుళ్లు ఆశించే అవకాశం ఉందని పత్తి పంటపై పేనుబంక పచ్చ దోమ ఆశించి ఉన్నాయని దీని నివారణకు వేప గింజల కషాయం ఉత్తమమైనదని తెలిపారు. పత్తిని ఫిబ్రవరి నెల వరకు పండించేటప్పుడు గులాబి రంగు పురుగు పై జాగ్రత్త వహించాలని అంతేకాకుండా పత్తి తీసివేసిన తర్వాత ఎండు పువ్వులను నాడెపు గుంతలో వేసుకుని నాణ్యమైన ఎరువులు తయారు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం ఎలాంటి ఎరువులు పురుగుమందులు వేయకుండా కేవలం గ్రామం నుండి వస్తున్న వ్యర్థపు నీటి ద్వారా పండించిన రైతు వై. లక్ష్మణరావు పత్తి పంటను పరిశీలించారు… ఎలాంటి తెగుళ్లు లేకుండా ఆరోగ్యంగా ఉందని రైతులు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అనంతరం సి .ఆర్ .పి కర్రీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 200 లీటర్ల జిల్లేడు ద్రావణాన్ని తయారు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్నాన వీరయ్య గ్రామ పెద్దలు సింహాచలం ఆదినారాయణ గ్రామ వ్యవసాయ సహాయకులు ఝాన్సీ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *