
అన్నపూర్ణాదేవి గా దర్శనమిచ్చిన శంబర పోలమాంబ అమ్మవారు
పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం, శంబర గ్రామంలో వేంచేసియున్న ప్రముఖ ఇలవేల్పు, ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దేవత కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ శ్రీ శ్రీ పోలమాంబ అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రి మహోత్సవములు భాగంగా 3వ రోజు అనగా
తదియ బుధవారం శ్రీ అన్నపూర్ణ దేవి అవతారం అలంకరణ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి వివిధ రకాల గాజులతో ప్రత్యేక అలంకరణ చేయడమైనది. తదుపరి మండప పునః పూజలు , మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన అత్యంత వైభవోపేతంగా శాస్త్రోక్తంగా జరిగాయి. తదుపరి సాయంత్రం మారేడు పత్రితో రుద్ర పాశుపత హోమం , విశేష హోమములు జరిగాయి.అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. కె.శ్రీనివాసశర్మ ఆద్వర్యం లో నిర్వహించడం జరిగినది. ఈ విశేష కార్యక్రమంలలో వివిధ ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్య నిర్వహణ అధికారి బి.శ్రీనివాస్ పర్యవేక్షణలో తగు ఏర్పాట్లు చేశారు.