సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు
దసరా శరన్నవరాత్రులు రెండో రోజు గాయత్రీ దేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు జయ జానకి బృందం చేత కోలాటం నిర్వహించారు. ఆర్యవైశ్య కుటుంబ సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.