పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం జైపూర్ రోడ్ లో సాలూరు మోటార్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ విజయ దుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవములు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఉత్సవాలు జరుపుతామని అన్నారు. మండపంలో కొలువైన బంగారు తల్లి దుర్గమ్మ దర్శనంతో భక్తులు భక్త పారవశ్యానికి లోనయ్యారు.