సాలూరు టౌన్ రిలయన్స్ స్మార్ట్ లో కాలం చెల్లిన చపాతి, పాలు అమ్మకం

ఆంధ్రప్రదేశ్ సాలూరు సమాచారం

“పేరు గొప్ప ఊరు దిబ్బ” అనే సామెత చందంగా సాలూరు రిలయన్స్ స్మార్ట్ బజార్ లో కాలం చెల్లిన చపాతీ ప్యాకెట్లు, ఓ ప్రముఖ కంపెనీకి చెందిన లాక్టోజ్ ఫ్రీ పాలు కాలం చెల్లినవి ఇక్కడ విక్రయానికి సిద్ధంగా ఉండటం గమనార్హం…. “ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు” అనే సామెత గుర్తుకు వస్తుంది. విద్యావంతులు, అక్షర జ్ఞానం కలిగిన వారు ప్రతి వస్తువు క్షుణ్ణంగా పరిశీలించి కొనేవారు అయితే పర్వాలేదు. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది మిషన్ గమనించి ఉపయోగించడం మానివేయడం లేదా తిరిగి షాప్ వరకు అప్పగించి వారు తమ సొమ్మును వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అక్షర జ్ఞానం లేని వారు కొని ఉపయోగించి అనారోగ్యం పాలు అవుతారు.దానికి వినియోగదారుడు భారీ మూల్యం చెల్లించాల్సిందే కదా? ఇక్కడ తప్పు ఎవరిది అని గమనిస్తే సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది.ఇక్కడ చెప్పేది ఏమిటంటే రిలయన్స్ స్మార్ట్ అనే అతి పెద్ద కార్పొరేట్ సంస్థ సిబ్బంది నిర్లక్ష్యమా లేక వారి వ్యాపారాన్ని దిగ్విజయంగా లాభాల బాటలో సాగిస్తున్న సంస్థ వారి వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం సిబ్బందికి టార్గెట్లు పెడుతున్నారా? లేదా సిబ్బంది నిర్లక్ష్యమా కారణం ఏదైనా కావచ్చు కానీ అక్కడ కాలం చెల్లిన వస్తువులే కనిపిస్తున్నాయి మేనేజర్ నిర్లక్ష్యమా లేక దేశంలో అతిపెద్ద కార్పొరేట్ సంస్థ కావడం చేత తమనెవ్వరు ఏమి చేయలేరని గర్వమా? కారణం ఏదైనా కావచ్చు దీనికి ప్రజలు అనారోగ్యం ఫుడ్ పాయిజన్ వంటి వాటికి గురవుతున్నారు. ఈ విషయాన్ని చరవాణి ద్వారా ఆహార భద్రత శాఖ అధికారి వినోద్ కు సమాచారం అందించడం తదుపరి ఆయన రిలయన్స్ మాటలు తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ ను తీసుకొని పంచనామా నిర్వహించామని మీడియాకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *