సాలూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపు కి విశేష స్పందన లభించింది సుమారు 300 మందికి పైగా ప్రజలు హాజరై వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మొదలై సాయంత్రం 4:00 వరకు కొనసాగింది. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం లో భాగంగా స్త్రీల కోసం ప్రత్యేకంగా రక్త పోటు, మధుమేహం ,క్యాన్సర్, ఎన్.సి.డి స్క్రీనింగ్, టీబీ, శిశు సంరక్షణ కార్డుల పంపిణీ, హిమోగ్లోబిన్ స్థాయి పరీక్షలు వంటివి నిర్వహించామని సాలూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వి .ఆర్ .మీనాక్షి తెలిపారు.