దసరా సందర్భంగా శ్రీ సంతోషిమాత ఆలయం లో ప్రత్యేక పూజలు...
పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మామిడిపల్లి రోడ్డులో కోరి వెలసిన శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు సందర్భంగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక పూజలు, హోమాలను, కుంకుమ పూజలు తదితర కైంకర్యాలను నిర్వహిస్తామని భక్త బృందం ఒక ప్రకటన విడుదల చేశారు.