సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ లో భాగంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుందని, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వి.ఆర్. మీనాక్షి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా సాలూరు టౌన్ లో ఏరియా ఆసుపత్రిలో సెప్టెంబర్ 20 శనివారం ఉదయం 9 గంటల నుండి నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో మహిళల కోసం ఎన్ సి డి స్క్రీనింగ్,రక్తపోటు,మధుమేహం,కాన్సర్,క్షయ వ్యాధి,రక్తహీనత,చెవి,ముక్కు,దంత సమస్యలు,తల్లి,శిశు సంరక్షణ కార్డుల పంపిణీ,హీమోగ్లోబిన్ స్థాయి పరీక్షలు, వంటివి నిర్వహిస్తామని తెలిపారు.