
అమరావతి, సెప్టెంబర్ 18,(4th Estate News)
గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ ఇలా పేర్కొన్నారు:
రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో 55 వేల 746 అంగన్వాడీ కేంద్రాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో 48,268 అంగన్వాడీ కార్యకర్తలు, 6,732 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 47,569 అంగన్వాడీ సహాయకులు సేవలందిస్తున్నారు.
అంగన్వాడీ సిబ్బందికి అందజేస్తున్న గౌరవ వేతనాలు:
• అంగన్వాడీ కార్యకర్తలకు 11వేల 500
మినీ అంగన్వాడీ కార్యకర్తలకు 7 వేలు
• అంగన్వాడీ సహాయకులకు 7 వేలు
“2004లో తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పుడు జీతం కేవలం 2,700 మాత్రమే ఉండగా, నారా చంద్రబాబునాయుడు దాన్ని 4,200కి పెంచారు. మరియు 2014లో తెలుగుదేశం ప్రభుత్వం మరల బాధ్యతలు చేపట్టినప్పుడు జీతం 4,200 నుండి 10,500కి పెంచారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం ₹1,000 మాత్రమే పెరిగింది. కానీ ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది” అని మంత్రి స్పష్టం చేశారు.
అంగన్వాడీ వర్కర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు, 20 రోజుల వార్షిక సెలవులు, అలాగే మే నెలలో 15 రోజుల సెలవులు మంజూరు అవుతున్నాయి.
వారి సేవలను గుర్తిస్తూ ప్రత్యేక పురస్కారాలు అందజేస్తున్నాము:
అంగన్వాడీ వర్కర్లకు 50వేలు అవార్డు
అంగన్వాడీ సహాయకులకు 40 వేలు అవార్డు
అలాగే ప్రశంసా పత్రాలు కూడా అందజేస్తున్నాము.
ప్రతి సంవత్సరం రెండు యూనిఫామ్ సెట్లు అందజేస్తున్నాము.
గ్రాట్యుటీ చెల్లింపులు:
అంగన్వాడీ వర్కర్లకు 1,00,000
అంగన్వాడీ సహాయకులకు 40 వేలు
ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద విధి నిర్వహణలో మరణించిన పక్షంలో 2 లక్షల బీమా రక్షణ అందించబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 6,732 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వాటిలో 5,000 మినీ అంగన్వాడీలను సాధారణ అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసినట్లు తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కేవలం భోజనం మాత్రమే అందించడం కాకుండా, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్లే కిట్స్ కూడా అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్లే కిట్స్‌లోని బొమ్మల ద్వారా పిల్లలకు ఆటల రూపంలో చదువు నేర్పించడం, జ్ఞానం పెంపొందించడం, గుడ్ టచ్ బాడ్ టచ్ అవగాహన కల్పించడం జరుగుతోందని మంత్రి వెల్లడించారు.
11,400 అంగన్వాడీ కేంద్రాలకు మంచినీటి సదుపాయం, 10,000 అంగన్వాడీలకు మరుగుదొడ్లు, 8,000 అంగన్వాడీలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలో అంగన్వాడీలను శాశ్వత భవనాలుగా మారుస్తున్నాం అని పేర్కొన్నారు.
అంగన్వాడీ వర్కర్లపై కార్మికులపై ఉన్న కేసులను ప్రభుత్వం తొలగించే ప్రక్రియలో ఉందని తెలిపారు.
సొంత భవనం కలిగిన ప్రతి అంగన్వాడీకి ₹1,00,000 చొప్పున నిధులు కేటాయించబడతాయి. ఇందులో ప్రత్యేకంగా 10 వేలు పెరటి తోటల కోసం వినియోగించాలని సూచించారు.