పాంచాలి,సెప్టెంబర్ 17,(4th Estate News)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాంచాలి లో సెప్టెంబర్ 16 న ఓజోన్ పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీసి క్లస్టర్ కోఆర్డినేటర్ , జీవశాస్త్ర ఉపాధ్యాయులు
డి ప్రసన్నకుమార్ విద్యార్థులకు ఓజోన్ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించారు. పర్యావరణ అనుకూల విధానాలను అందరం పాటించాలని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులు ఓజోన్ పరిరక్షణ నినాదాలు చేస్తూ గొడుగులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సుచరిత , విద్యార్థులు మరియు ఇతర ఉపాధ్యాయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ఓజోన్ పరిరక్షణ అనే అంశం పైన చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరిగింది.