సాలూరు, సెప్టెంబర్ 17,(4th Estate News)
అక్రమంగా తరలిస్తున్న 891 కేజీల 49 రేషన్ బియ్యం బస్తాలను నాయుడు వీధికి చెందిన ఆర్యవైశ్య కులస్థులు గంటా చందు(45) సన్ ఆఫ్ లేట్ రామకృష్ణ , పెద్ద కోమటి పేట కు చెందిన మండా కామేశ్వరరావు(60) సన్ ఆఫ్ లేట్ వెంకటరాజు సాలూరు పెద్ద బజార్ లో అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న సాలూరు టౌన్ పోలీసులు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసి,అరెస్టు చేయడం జరిగింది. మొత్తం పిడిఎఫ్ బియ్యాన్ని సాలూరు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కు అప్పగించడం జరిగిందని సాలూరు టౌన్ సీఐ బొమ్మిడి అప్పలనాయుడు మీడియాకు తెలిపారు.