
సాలూరు,సెప్టెంబర్ 16,(4th Estate News)
2025 2026 విద్యా సంవత్సరం కి సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా ప్రైవేట్ ప్రభుత్వ ఐటిఐ కళాశాలల్లో మిగిలిన సీట్లకై భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా విద్యార్థులు సెప్టెంబరు 16 నుండి సెప్టెంబర్ 27వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవలసినదిగా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సెప్టెంబర్ 28 న జరుగును. సెప్టెంబర్ 29వ తేదీన ప్రభుత్వ ఐటిఐ లో సెప్టెంబర్ 30న ప్రైవేటు ఐటిఐ లలో నాలుగో విడత ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించబడునని, సాలూరు ప్రభుత్వ ఐటిఐ కాలేజ్ ప్రిన్సిపల్ కన్వీనర్ డి. శ్రీనివాసచారి ఒక ప్రకటనలో మీడియాకు తెలిపారు. మరిన్ని వివరాలకు 90525 08903, 8886789002 నెంబర్లను సంప్రదించగలరు.