తిరుపతి,సెప్టెంబర్ 16,(4th Estate News)
తిరుపతి లో జరిగిన తొలి జాతీయ మహిళా సాధికారిత సదస్సు ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కి మర్యాదపూర్వకంగా కలిసి ఆదివాసి గిరిజన ప్రాంతంలో గిరిజనుల కొరకు పొందుపరిచిన ముఖ్యమైన చట్టాల కొరకు కూలంకుశంగా చర్చించుకున్నారు.
రాష్ట్ర గవర్నర్ కి (ఆంధ్ర కాశ్మీర్) అరుకు ప్రాంతానికి పర్యటించవలసిందిగా కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం బాధాకరమని దానిని పున: పరిశీలించి ప్రభుత్వ ఆధీనంలో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.
ఇటీవల వెలువడిన డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టులు నియామకంలో స్థానిక గిరిజన ప్రాంత నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని జీవో నెంబర్-3 కి బదులుగా ప్రత్యామ్నాయ జీవోను సృష్టించి ఆదివాసి గిరిజన ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని. ఆదివాసీలకు సంబంధించి 1/70 చట్టం పటిష్టంగా అమలు కొరకు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ ను కోరారు.