
పాచిపెంట రూరల్,సెప్టెంబర్ 15,(4th Estate News)
రైతులు కేవలం ఏకపంట విధానాన్ని పాటించటం కంటే బహుళ పంటల విధానం లేదా అంతర్పంటల విధానాన్ని అవలంబించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని వ్యవసాయ అధికారి కే.తిరుపతిరావు అన్నారు. పాంచాలి గ్రామంలో వరి గట్ల మీద కంది విత్తనాలను నాటిస్తూ, పత్తిలో అంతర పంట గా వేసిన కంది ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర పంటల విధానంతో కేవలం అదనపు ఆదాయం రావడమే కాకుండా భూమి బయట లోపల జీవ వైవిధ్యం పెరిగి భూమి యొక్క భౌతిక స్థితి మెరుగుపడి పంటకు కావలసిన అన్ని పోషకాలు అందుతాయని బహుళ పంటల వేరు బుడిపెలు లో ఉన్న సూక్ష్మజీవులు గాలిలో ఉన్న నత్రజని భూమిలోకి స్త్రీకరించి పంటకు అందేటట్లు చేస్తుందని వివరించారు. అలాగే వరి గట్ల మీద కంది విత్తనాలు నాటుకోవడం ద్వారా ఒక ఎకరా వరిగట్ల మీద నుండి కనీసం 100 కిలోల వరకు కంది పంటను పొందవచ్చని దీనికి ఎలాంటి ఖర్చు లేదని ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న కందిని నాటుకుంటే సరిపోతుందని తెలిపారు. గట్ల మీద కంది విత్తనాలు నాటడం ద్వారా వేరే వ్యవస్థ భూములోనికి వెళ్లడం వలన గట్లు కూడా స్థిరంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు మోహన్ కృష్ణ, ప్రకృతి సేద్య ఉద్యోగులు పాల్గొన్నారు.