
సాలూరు, సెప్టెంబర్ 11,(4th Estate News)
సాలూరు టౌన్ లో బుదవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ,రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పీడిక.రాజన్నదొరని ఆయన నివాసంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సర్వీశెట్టి.శ్రీనివాసరావు ,పార్వతీపురం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కోలా.సుధాకర్ ,స్టేట్ ఆర్టిఐ వింగ్ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి.నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా *మాజీ డిప్యూటీ సీఎం పి.రాజన్నదొరకి పుష్పగుచ్చం అందజేస్తూ దుస్సాలువాతో చిరు సత్కారం చేశారు.తదనంతరం పార్టీ స్థితిగతులు గూర్చి కాసేపు చర్చించుకున్నారు.పార్టీ పటిష్టత కోసం అంతా ఏకమై అందరినీ సమన్వయ పరుచుకుని కృషి చేయాలని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర వారికి సూచించారు.మరికొద్ది నెల్లల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి విజయభేరి మ్రోగించాలని దానికి తగ్గ ప్రణాళికలు ఇప్పటి నుంచి వేసుకోవాలని వారికి తెలిపారు.