ఆంధ్రప్రదేశ్,సెప్టెంబర్ 11,(4th Estate News)
రెండు రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఒక వార్ రూమ్ గా చేసుకుని మంత్రి నారా లోకేష్ చేసిన కృషి... తెలుగువారిని క్షేమంగా స్వరాష్ట్రానికి చేర్చింది. ఆర్టిజిఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంత్రి లోకేష్ ని, లోకేష్ బృందాన్ని మంత్రి గుమ్మిడి_సంధ్యారాణి కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అప్పట్లో ఉత్తరాఖండ్ వరదల సమయంలో నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేపాల్ ఘటనలో నారా లోకేష్ తెలుగు వారికి అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చారు.