సాలూరు, సెప్టెంబర్ 7,(4th Estate News)
ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రైతులకు యూరియా కొరత, రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్సిపీ నిరసనలకు పిలుపునిచ్చింది ఈ క్రమంలో *సెప్టెంబర్ 9వ తేదీన అనగా మంగళవారం *వైఎస్ఆర్సిపీ "అన్నదాత పోరు"* కార్యక్రమం చేపట్టనుంది.... ఇందులో భాగంగా ఆర్డిఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.శనివారం సాలూరు టౌన్ లో తన క్యాంపు కార్యాలయంలో *"అన్నదాత పోరు" పోస్టర్* ని *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు* *పీడిక.రాజన్నదొర రిలీజ్ చేశారు.ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ ప్రజాప్రతినిధులు,వైసీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.