యూరియా కరువు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ సాలూరు సమాచారం

 

సాలూరు, సెప్టెంబర్ 6,(4th Estate News)

రైతు బాంధవుడునని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ నెల వచ్చినంత వరకు రైతులకు విత్తనాలు, యూరియా అందించడంలో విఫలమైందని మాజీ మంత్రి పి. రాజన్న దొర కూటమి ప్రభుత్వ పై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అయితేనేమి రాజశేఖర్ రెడ్డి అయితేనేమి రైతులకు ఉన్న ఉచిత విద్యుత్ ఇవ్వడంతోపాటు బకాయిలను రద్దు చేస్తామని చెప్పి రద్దు చేశారన్నారు. రైతుల బ్యాంకులో ఉన్న రుణాన్ని కూడా మాఫీ చేసిన ఘనత వైయస్సార్ ప్రభుత్వానన్నారు. నేడు రైతు భరోసా కేంద్రాలతోపాటు సచివాలయాలను కూడా ఈ ప్రభుత్వం అధికిస్తున్నట్లు వింటున్నామన్నారు. అలాగే రైతులకు యూరియా అందించడానికి కూడ సచివాలయాలలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయ్యాలా అని విమర్శించారు. రైతులు వ్యవసాయ మార్కెట్ కేంద్రాల వద్ద యూరియా అడిగిన లేదంటున్నారు. సొసైటీల వద్ద వెళ్లి అడిగిన ఏరియా లేదని అధికారులు బదులిస్తున్నారని వాపోతున్నారు ఎక్కడా యూరియా లేకపోతే వచ్చిన యూరియా అంతా ఏమవుతుందని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిన్న కాక మొన్న మామిడి పంచాయితీలో ఉన్న రైతులకు ఒక్కొక్క బస్తా కూడా ఇవ్వలేని దుస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. నాడు వైయస్సార్ ప్రభుత్వంలో చెప్పినవన్నీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసి చూపించారన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో అబద్ధపు హామీలే తప్ప హామీలను ఆచరణలో పెట్టడం లేదని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *