సాలూరు, సెప్టెంబర్ 5,(4th Estate News)
భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 5 న భారత మాజీ రాష్ట్రపతి గొప్ప తత్వవేత్త విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. ఆయన జీవితాన్ని బోధన విద్యారంగానికి అంకితం చేశారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాసవిక్లబ్ విజయం వారు, ఆర్యవైశ్య ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు, ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించినారు ఈ కార్యక్రమం లో క్లబ్ అధ్యక్షులు కోలగట్ల వెంకట గోపాలరావు, కార్యదర్శి అవ్వ మంగరాజు, కోశాధికారి గ్రంధి దుర్గా ప్రసాద్ ఆర్యవైశ్య సంఘ పెద్దలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యదర్శి కోలగట్ల రమాదేవిని ఘనంగా సత్కరించారు.