
పాచిపెంట రూరల్,సెప్టెంబర్ 5,(4th Estate News)
ప్రకృతి సేద్యం వలన లాభాలు అంతర పంటల వలన కలిగే ఫలితాలను తెలుసుకోవడం కోసం మహారాష్ట్ర ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ , రాజస్థాన్ నుండి 16 మంది సభ్యులతో కూడిన డీఎస్సీ ఎన్జీవో బృందం పాచిపెంట మండలంలో పర్యటించింది ఈ సందర్భంగా అమ్మ వలస, కర్రివలస గ్రామాలలో అమలవుతున్న ప్రకృతి సేద్య పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మహిళా రైతులు ఆల్తి సరస్వతమ్మ, లండ సుమలత లతో మాట్లాడి ప్రకృతి సేద్య అనుభవాలను తెలుసుకున్నారు. గత మూడు సంవత్సరాల నుండి ప్రకృతి సేద్యం చేస్తున్నామని, ముఖ్యంగా ప్రకృతి సేద్యంలో మొక్కజొన్న, పత్తి పంటలలో ఆకుకూరలు, చోడి ,వేరుశనగ, మినుములు వంటివి అంతర పంట గా వేసి, కంది ,ఆముదం గట్ల మీద నాటుకోవడం వలన ప్రధాన పంటకు కావలసిన పెట్టుబడి అంతర పంటల ద్వారా సంపాదించవచ్చని గత సంవత్సరం 15 వేల రూపాయలకు పైగా అదనపు ఆదాయాన్ని పొందామని వివరించారు. ఈ సందర్భంగా ప్రకృతి సేద్య రీజనల్ ట్రైనింగ్ ఆఫీసర్ హేమ సుందర్ మాట్లాడుతూ… ఏకపంట విధానాన్ని దీనివలన నేల లోపల బయట జీవవైవిద్యం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రకృతి సేద్యంలో నవధాన్యాలు కీలకమని పశువుల పెంట కనీసం 10 టన్నులు వేసుకోవాలని తదుపరి జీవామృతాలు కషాయాలు తయారు చేసుకుని వాడుకుంటే రసాయన ఎరువులు పురుగుమందులపై ఆధారపడాల్సిన అవసరం లేదని రైతులు బృంద సభ్యులకు వివరించారు. ప్రకృతి సేద్య జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రావణ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ పురుగులు తెగుళ్ల నివారణకు నీమాస్త్రం పంచ పత్ర కషాయం దశపర్ని వంటి ఉపయోగపడతాయని జిల్లేడు కషాయం పిచికారి చేసుకుంటే జిల్లేడు లో ఉన్నటువంటి పోషకాలు పంటల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని వరి పత్తి పంటలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, జిగురు ఆటలను ఏర్పాటు చేయడం ద్వారా పత్తి పంటలో ఉన్న రసం పీల్చు పురుగులను నివారించవచ్చని తెలిపారు. అనంతరం జీవామృతం తయారీ జిల్లేడు కషాయం తయారీ లను బృంద సభ్యులకు వివరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు ఎంఎస్ఎఫ్ దేవి ప్రసాద్ ప్రకృతి సేద్య ఎం టీ, సి అర్ పి, ఐసిఆర్పీలు పాల్గొన్నారు.
అ