అప్పికొండ కు ఘన సత్కారం
సాలూరు రూరల్,సెప్టెంబర్ 5,(4th Estate News)
సెప్టెంబర్ 5 న సాలూరు మండలం తోనాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల లో కాంట్రాక్టు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న అప్పికొండ గణపతిరావు మాష్టారు ని
ఉపాధ్యాయ
దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు సన్మానించారు. ముంగివాని వలస జీ.పీ.ఎస్ పాఠశాలలో డిప్యూటేషన్ పై కొద్దిరోజులుగా పని చేసి ఆగస్ట్
15 వేడుకలు బాగా జరిపించి కొద్ది రోజుల్లోనే మా పిల్లలకు మాకు ఆప్తుడు అయ్యారు. అప్పికొండ అని ముంగి రాంబాబు కొనియాడారు అంతే కాక ఇటువంటి ఉపాధ్యాయుడే మాకు, మా గ్రామానికి కావాలని కోరారు.