సాలూరు లో ఘనం గా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం... కె.పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
సాలూరు,సెప్టెంబర్ 2,(4th Estate News)
జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో పవన్ కళ్యాణ్ గోత్ర నామంతో అర్చనలు పూజ చేయించడం జరిగింది. తదుపరి సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, మినిస్టర్ కూటమి అభ్యర్థి అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ జంక్షన్లో కేక్ కటింగ్ జరిగింది. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ముక్కు సూటితనం, ఆయన నిబద్ధత, సిద్ధాంతపరమైన రాజకీయాలు యావత్తు యువతకు మార్గదర్శకం అని కొనియాడారు... తధానంతరం సాలూరు వై.టి.సి లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు,రొట్టెలు పంచడం జరిగింది....
ఈ కార్యక్రమంలో సాలూరు మండల అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివకృష్ణ, పిఎసిఎస్ డైరెక్టర్ మీసాల నవీన్ కుమార్, జనసేన లీగల్ సెల్ అడ్వైజర్ సుశాంత్ కుమార్,సీనియర్ నాయకులు వసంతుల శ్రీను, మురళి హేమంత్ భాను తదితరులు పాల్గొన్నారు...
సాయంత్రం జరగబోయే వివిధ జంక్షన్ కేక్ కటింగ్ కార్యక్రమాల్లో పాల్గొని ఈ జనసేన పండుగను విజయవంతంగా నిర్వహిస్తారని తెలియజేశారు...