పాచిపెంట రూరల్,సెప్టెంబర్ 2,(4th Estate News)
మండలంలో ఇప్పటివరకు ఆ రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రైవేటు ఎరువుల వ్యాపారుల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా మొత్తం 1176 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశామని రాబోయే రెండు రోజులలో ఇంకొక 36 టన్నుల యూరియా మండలానికి రాబోతుందని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. అధిక యూరియా వాడడం వలన వరి పత్తి మరియు మొక్కజొన్న పంటలలో తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంటుందని కాబట్టి రైతులు కనీసం 15% యూరియా వాడకాన్ని తగ్గించాల్సి ఉందని వరి పంట ఎక్కువగా ఇంటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా యూరియా వినియోగాన్ని తగ్గించాలని కోరారు. గురువు నాయుడుపేట మాతుమూరు రైతు సేవా కేంద్రాల పరిధిలో యూరియా పంపిణీ పరిశీలించారు ప్రస్తుతం యూరియా కొరత లేదని కొంతమంది రైతులు రబీ సీజన్ అవసరాల నిమిత్తం భద్రపరుచుకుంటున్నారని రైతు తన ప్రస్తుత అవసరo మేరకు మాత్రమే ఎరువులు కొనుగోలు చేసుకోవాలని తెలిపారు. రైతులు యూరియాను మూడు దఫాలుగా పంటకు వేస్తున్నారని మొదటి దశ బస్తాలు ఎరువు వేసుకొని రెండవ దశ నానో యూరియాను పిచికారి చేసుకోవాలని మూడవ దశ మరల బస్తా ఎరువులు వేసుకోవాలని ఒక్కోసారి కేవలం 25 కిలోలు మాత్రమే వేసుకుంటే సరిపోతుందని, కొంతమంది రైతులు పొటాషి ఎరువు అధిక ధర ఉన్నందున యూరియా అధికంగా వాడుతున్నారని దీనివలన దిగుబడులు తగ్గుతాయే గాని ఎట్టి పరిస్థితుల్లో పెరగవని ఖర్చు మాత్రమే పెరుగుతుందని తెలిపారు. కాబట్టి రైతులు పంట అవసరానికి తగినంత మేర లో మాత్రమే ఎరువులు వేసుకోవాలని సూచించారు.