సాలూరు, సెప్టెంబర్ 1,(4th Estate News)
ప్రోగ్రాం లో భాగంగా దుగ్ధిసాగరం గ్రామం దగ్గర లో ఉన్న శ్రీ నవదుర్గ క్రషర్ లొ పని చేస్తున్న కార్మికులకు క్షయవ్యాధి పై అవగాహన చెయ్యటం జరిగింది.
టిబి ముక్తి భారత్ అభియాన్ ప్రోగ్రాం లో ప్రతి వ్యక్తి కి టిబి స్క్రీనింగ్ చేసి టిబి నిర్ధారణ పరీక్షలు చెయ్యటం జరుగుతుంది .ఎక్కువగా చెడు అలవాట్లు ఉన్న వారికి ముసలి వాళ్ళకు,వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్లకు టిబి స్క్రీనింగ్ చేసి లక్షణాలు అడిగి తేలుకొని దగ్గర్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు పంపించటం జరుగుతుంది.
ఈ కార్యక్రమం ఈ ప్రతి జిల్లా లో జరుగుతుంది . ఈ అవకాశం ను అందరు వినియోగించుకొని ప్రతి ఒక్కరు మా ఆరోగ్య సిబ్బంది కి సహకరించవలసినదిగా కోరుచున్నాం.
పరీక్షల్లో టిబి ఉందని నిర్ధారణ అయితే వెంటనే వైద్యుల పర్యవేక్షణలో టిబి మందులు ఇవ్వటం జరుగుతుంది.
ప్రతి టిబి పేషెంట్ కి *నిక్షయ పోషణ యోజన పథకం* ద్వారా టిబి మందులు వాడుతున్నంత కాలం 1000 రూపాయలు టీబీ పేషెంట్ అకౌంట్ లో పడుతుంది.
అలాగే ప్రతి టిబి వ్యాధి గ్రస్తుడను దత్తత తీసుకొని వారికి ప్రతి నెల పోషకాహారం అందించటానికి డోనార్స్ ముందుకు రావాల్సిందిగా జిల్లా కలెక్టర్ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి , జిల్లా టిబి అధికారి కోరడమైనది...
ఈ కార్యక్రమంలో క్రషర్ సిబ్బంది,టీ. నరేష్ టిబి సూపర్వైజర్,
నివేదిత ఎం.ఎల్. హెచ్.పి ,ఆశ పాల్గొనడం జరిగింది.