సాలూరు రూరల్,ఆగస్టు 31,(4th Estate News)
ఉత్తరాంధ్ర మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ చేతులు మీదుగా ట్రస్టు ఎంపిక చేసుకున్న పాఠశాలలలో పదవ తరగతి స్కూల్ టాపర్స్ కు 55 వేల రూపాయలను అందజేశారు. 584 మార్కులు సాధించిన ఆర్. శివాజీ ( మున్సిపల్ కస్పా హైస్కూల్ విజయనగరం) కు 25 వేల రూపాయలు, 562 మార్కులు సాధించిన ఏ. జానకి (పి.ఎస్.ఎన్. ఎం హైస్కూల్, శ్రీకాకుళం) కి 15వేల రూపాయలను, 561 మార్కులు సాధించిన జీ. యెగ్నేష్ (జిల్లా పరిషత్ హై స్కూల్ దత్తిరాజేరు) కు 15 వేల రూపాయల ను గొర్తి ఈశ్వర ట్రస్టు స్థాపకులు జి.వి .ఎస్. పి.కుమార్, ఈ. ఉషా బాలా దంపతుల 2014 వ సంవత్సరం నుండి ప్రతీ ఏటా టాపర్స్ కు ప్రైజ్ మనీ అందిస్తున్నారు. ఈకార్యక్రమంలో ట్రస్టు కోఆర్డినేటర్ బోని అప్పలనాయుడు, రిటైర్డ్ ఉపాధ్యాయులు చప్ప అప్పలనాయుడు, బాలు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.