సాలూరు,ఆగస్టు 29,(4th Estate News)
సాలూరు టౌన్ మామిడిపల్లి రోడ్ లో కోరి వెలసిన శ్రీ గణేశ పుత్రిక సంతోషి మాత ఆలయం లో ప్రత్యేక పూజలు జరిగాయి.వినాయక నవరాత్రులు ఘనం గా జరుగుతున్నాయి.స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుమారుడు గుమ్మిడి పృథ్వీ జన్మదినం సందర్భంగా వినాయకుడికి వస్త్రాలు,పసుపు,కుంకుమ సమర్పించారు.విజయవాడ కు చెందిన హరిప్రియ,పాలవలస లక్ష్మీ అమ్మవారికి చీరలు పసుపు కుంకుమ సమర్పించుకున్నారు.ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు.