గ్రీన్ వరల్డ్ సంస్థ ఆధ్వర్యంలో గుమ్మిడి పృథ్వి రాజ్ జన్మదిన వేడుకలు
సాలూరు,ఆగస్టు 29,(4th Estate News)
స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గుమ్మిడి జయకుమార్ ల తనయుడు గుమ్మిడి పృధ్విరాజ్ జన్మదిన సందర్భంగా ఆగస్టు 29 న స్థానిక వై టి సి గిరిజనుల గర్భిణుల వసతి కేంద్రంలో గ్రీన్ వరల్డ్ సంస్థ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రాహి ఆధ్వర్యంలో గర్భిణులకు రొట్టెలు యాపిల్ పండ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకొని,ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రేయోభిలాషులు,స్నేహితులు,ప్రజలు ఆశీస్సులు,శుభాకాంక్షలు తెలిపారు.