
సాలూరు,ఆగస్టు 26,(4th Estate News)
సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్
ఆగస్టు 26 న మధ్యాహ్నం 1:45 గంటలకు సమయంలో ఇద్దరు వ్యక్తులు సాలూరు పట్టణంలో గల ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని సమాచారం రాగా ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్దకు చేరుకుని ఇద్దరు వ్యక్తులను పట్టుకొని విచారించగా వారి పేర్లు వివరాలు ఒకరు తెలంగాణ ఇంకొకరు ఒడిశా రాష్ట్రము వాళ్లు పట్టుబడ్డారు… వాళ్ళ వద్ద ఉన్న బ్యాగులను ను తనిఖీ చేయగా ఆ బ్యాగుల్లో లో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. వాటి బరువు 5 కిలోల 60 గ్రాములు ఉన్నది. సదరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బొమ్మిడి అప్పలనాయుడు సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ చేపట్టారు. ఆగస్టు 26 న రిమాండ్ కు తరలించడం అయినది. సదరు వ్యక్తిలు ఆ గంజాయిని మల్కనగిరి ప్రాంతంలో కొని, తాను పనిచేస్తున్నటువంటి తెలంగాణ కి తరలిస్తుండగా పట్టుబడ్డాడు.