
శ్రీ బాల గణపతి మండపం నిర్మాణ దాత గా మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర
సాలూరు,ఆగస్టు 27,(4th Estate News)
సాలూరు టౌన్ పరిధిలో బంగారమ్మ కాలనీ, అభయాంజనేయ స్వామి ఆలయం దారిలో నూతనంగా మాజీ ఎమ్మెల్యే పిడిక రాజన్న దొర నిర్మాణ దాతగా శాశ్వత వినాయక మండపాన్ని నిర్మించారు. ఇటీవల జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, వినాయక చవితి సందర్భంగా వినాయక పూజ నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అక్కడ విచ్చేసిన భక్తులు మాజీ మంత్రి రాజన్న దొరను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.